చిరుజల్లులతో పులకించిన తిరుమల
తిరుమల: తిరుమలలో పొగమంచుతో కూడిన చల్లటి వాతావరణం భక్తులను పరవశింపజేస్తోంది. కొన్ని రోజులుగా వేడి, ఉక్కపోత వాతావరణంతో విసిగిపోయిన ప్రజలు ఒక్కసారిగా చిరుజల్లులు కురవడంతో ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరుతున్నారు. రెండు రోజులుగా ఉదయం వేళల్లో తిరుమల ఆలయ పరిసరాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. దీనికి ప్రకృతి అందాలూ జత కావడంతో భక్తుల్లో ఆనందం రెట్టింపు అవుతోంది. అద్భుతమైన ఈ దృశ్యాలను తమ సెల్ కెమెరాల్లో చిత్రీకరించి సన్నిహితులతో పంచుకుంటున్నారు.