విశాఖ మన్యంలో చలి పులి అప్పుడే గజగజ వణికిస్తోంది.
విశాఖ మన్యంలో చలి పులి అప్పుడే గజగజ వణికిస్తోంది. నాలుగు రోజలుగా వేకువజామున నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉదయం 9గంటల వరకు హెడ్‌లైట్ల వెలుగులోనే వాహనదారులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. పల్లెజనం చలి నెగళ్లను ఆశ్రయిస్తున్నారు.