విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి. మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. లంబసింగిలో సోమవారం రాత్రి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోదకొండూరు, చింతపల్లి ప్రాంతాల్లో 8 డిగ్రీలు, పాడేరు, అరకులో ఉష్ణోగ్రత 9 డిగ్రీలుగా ఉంది. ఉదయం పది గంటల వరకూ మంచు కురుస్తూనే ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. పెరిగిన చలి తీవ్రతకు మన్యం వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.