భారీ పొగమంచు, తప్పిన ఘోర రైలు ప్రమాదం | Fog Leads To Train Accident Near Cuttack Several Injured | Sakshi
Sakshi News home page

భారీ పొగమంచు,  తప్పిన ఘోర రైలు ప్రమాదం

Published Thu, Jan 16 2020 9:14 AM | Last Updated on Thu, Jan 16 2020 12:04 PM

Fog Leads To Train Accident Near Cuttack Several Injured - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. భారీ పొగమంచు కారణంగా ముంబై-భువనేశ్వర్ లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) ప్రమాదానికి గురైంది. కటక్‌లోని సలాగావ్ -నెర్గుండి రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. దీంతో  పట్టాలు తప్పి ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

ముంబై నుంచి భువనేశ్వర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి జేపీ మిశ్రా తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ ఆస్పత్రికి తరలించామన్నారు. సంబంధిత రైల్వే, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయకార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ఆయన  తెలిపారు. ఈ ప్రమాదంపై  ప్రభు త్రిపాఠి అనే ప్రయాణీకుడు ట్విటర్‌లో  సమాచారం అందించారు.

ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్- (0764) 1072 లేదా (0674),  1072 కు కాల్ చేయవచ్చని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు సూచించారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల నెదుర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement