పొగమంచుతో 45 రైళ్లు రద్దు | 45 Delhi-bound trains cancelled due to fog | Sakshi
Sakshi News home page

పొగమంచుతో 45 రైళ్లు రద్దు

Published Tue, Jan 26 2016 1:46 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

45 Delhi-bound trains cancelled due to fog

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం 45 రైళ్లను రద్దు చేశారు. మరో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు ఉత్తరాది రైల్వే తెలిపింది.

ఈ రోజు ఉదయం ఢిల్లీలో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఇటీవల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement