దేశ రాజధానిలో మంగళవారం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన 96 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన 96 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్టు ఉత్తర రైల్వే తెలియజేసింది. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.