శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్కు రావాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
అలాగే ఇక్కడి నుంచి తిరుపతి, విశాఖపట్టణం, బెంగళూరు, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాలు 30 నుంచి 40 నిమిషాలు ఆలస్యంగా వెళ్లనున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. గోవా, విజయవాడ, లండన్కు విమానాలు రద్దు చేసినట్టు వెల్లడించారు.
మిగతా ప్రాంతాల్లోనూ మంచు ప్రభావం ఉండడంతో ఇక్కడి రావాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వివరించారు. పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్టులో వేచి చూడాల్సి వస్తోంది.