గాలిబండ మార్గంలో కమ్ముకొన్న మేఘాలు
చిత్తూరు జిల్లాలోని పర్యాటక కేంద్రం హార్సిలీకొండను మూడురోజులుగా మంచు తెర కప్పేస్తోంది. వాతావరణం మారడంతో రోజూ చిరుజల్లుల వర్షం కురుస్తోంది. పర్యాటకులు, స్థానికులు రోడ్లపై నడుస్తుంటే మబ్బుల్లో తేలిపోతున్న అనుభూతికి లోనవుతున్నారు. వాహనాలు పగలే లైట్లు వేసుకొని వెళ్లాల్సివస్తోంది. ఎదురుగా పర్యాటకులు నడచివెళ్తున్నా కనిపించని పరిస్థితి నెలకొంది. లోతైన లోయలు, ప్రకృతి అందాలకు నెలవైన కొండపై ఇప్పుడు చలి అధికమైంది. ఈ వాతావరణం కొండకు కొత్త అందాలు తెచ్చిపెట్టగా పర్యాటకుల ఆహ్లదకరమైన వాతావరణ ం ఆస్వాదిస్తున్నారు.
––బి.కొత్తకోట