
సాక్షి,కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం పది రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించకపోవడంతో విమానం హైదరాబాద్ వైపు మళ్లింది.
పొగమంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు ఆలస్యం అవుతోంది. దీంతో విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తరచు అంతరాయం ఏర్పడుతోంది.