చలికి విశ్రాంతినిచ్చిన కొత్త సంవత్సరం!
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం చలికి విశ్రాంతినిచ్చింది. ప్రధానంగా దేశ రాజధాని హస్తినలో గత కొన్ని రోజులుగా చలితో ప్రజలు వణికిపోతున్నారు.అయితే కొత్త సంవత్సరంతో వారికి కాస్త ఉపశమనం చేకూరింది. తాజాగా గురువారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త మెరుగుపడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా పొగమంచు కారణంగా 40 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, 15 రైళ్లను రద్దు చేసినట్లు నార్త్ రైల్వే ప్రకటించింది. మరో ఏడు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది.