దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా ఆవహించడంతో రైళ్లు, విమానాల రాకపోలకు అంతరాయం ఏర్పడింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా ఆవహించడంతో రైళ్లు, విమానాల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరాది రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, 7 రైళ్ల ప్రయాణ వేళలను మార్చారు.
మంచు కారణంగా ఏడు విమానాల రాకపోకలపైనా ప్రభావం చూపించింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటీవల ఢిల్లీలో పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.