
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం
కోల్‌కతా : పొగమంచు కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 13 నిండు ప్రాణాలు బలవ్వటంతో పాటు మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ ట్రక్కు రోడ్డును కప్పేసిన పొగమంచుతో దారి కనిపించక ఆటోను, కారును ఢీకొట్టింది. దీంతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment