
పొగ ‘తాగ’మంటుంది..
పొగబాబులు ఈ విషయం చెబితే నమ్మరు కానీ.. పొగ చూరిన బాడీలోని నికోటిన్‌లెవల్స్ ఆత్మారాముడ్ని..
పొగబాబులు ఈ విషయం చెబితే నమ్మరు కానీ.. పొగ చూరిన బాడీలోని నికోటిన్‌లెవల్స్ ఆత్మారాముడ్ని.. మందు పుచ్చుకోమని తెగ ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు బాటిల్ బద్దలు కొట్టారు. చాలామంది మందుబాబులు.. చుక్కేసినప్పుడే.. దమ్ము లాగుతామని చెబుతుంటారు. అయితే గొంతులోకి జారుకున్న చుక్క.. ఊపిరితిత్తుల ద్వారా నరనరాల్లోకి చేరుకున్న పొగ.. రెండూ ఒకే న్యూరాన్ సిస్టమ్‌పై ప్రభావం చూపి మద్యంపై మరింత మోజును పెంచుతాయని సైంటిస్టులు సెలవిచ్చారు. ఈ విష వలయంలో చిక్కుకున్న పొగరాయుళ్లు ‘ఆల్క’హానిని బహుమతిగా పొందుతున్నారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.