వణుకుతున్న రాష్ట్రం
► ఆదిలాబాద్‌లో 7 డిగ్రీలు
► మెదక్‌లో 10 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి పూట చలి వాతావరణం కొనసాగుతోంది. పగలు మాత్రం సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, రామగుండంలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పడిపోయాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీలు, మెదక్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఖమ్మంలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీలు, హైదరాబాద్‌లో 3 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీలు, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీలు, నల్లగొండలో 3 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే రికార్డయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 4 డిగ్రీలు ఎక్కువగా 34 డిగ్రీలు, మెదక్‌లో 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.