శంషాబాద్ విమానాశ్రయంలో దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దాంతో వివిధ నగరాలకు బయలుదేరవలసిన పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. దాంతో హైదరాబాద్ నగరం నుంచి శుక్రవారం బయలుదేరవలసిన పలు విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం విజయవాడ, రాజమండ్రి, తిరపతి, కొల్కత్తా నగరాలకు బయలుదేరవలసిన విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు.
అలాగే ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవలసిన బెంగళూరు, విజయవాడ విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.