
సాక్షి, ఢిల్లీ: ఉత్తర భారతదేశంలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల సాధారణ ప్రజలే గాక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానశ్రయం నుంచి విమానాల రాకపోకలకు నిలిచిపోయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయ్యాయి. గడిచిన మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.
పొగమంచు కారణంగా సోమవారం హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికిపైగా మృతి చెందిన విషయం తెలిసింది. ప్రధాన రోడ్లను సైతం మంచు కప్పివేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. గడిచిన మూడురోజుల నుంచి చలికి ఉత్తర భారతం వణుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment