నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. పొగ మంచు ఎక్కువగా ఉండడంతో రోడ్డుపక్కన ఆగివున్న లారీ కనిపించక వెనుక వేగంగా వస్తున్న లారీ డీకొంది. ఈ ప్రమాదంలో ఆగిఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కామినేని ఆస్పత్రికి తరలించారు.