
బస్సు నుంచి పొగలు..తప్పిన ప్రమాదం
జడ్చర్ల(మహబూబ్‌నగర్ జిల్లా): జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేసి ఉద్యోగులను దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదసమయంలో బస్సు జడ్చర్ల నుంచి పోలేపల్లి ఫార్మా సెజ్‌కు వెళ్తోంది.
షార్ట్ సర్క్యూట్ వల్లే పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన జరిగినపుడు బస్సులో 50 మంది ఉన్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.