
కడపకు ట్రూజెట్ సేవలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ విమాన సేవలను అందించే ట్రూజెట్ కడపకు సర్వీసులను ప్రారంభించింది. ఏప్రిల్8న హైదరాబాద్- కడప, తిరుపతి-కడపలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారపరంగా చాలా ముఖ్యపట్టణమైన కడపకు ట్రూజెట్ ఒక్కటే సర్వీసులను అందిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇంత వరకు విమాన సర్వీసులు లేని నాగపూర్, ఔరంగాబాద్ తర్వాత ఇప్పుడు మూడో పట్టణం కడపకు సేవలను విస్తరిస్తున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. దీనివల్ల ఇప్పుడు కడప నుంచి నాగపూర్, గోవా, రాజమండ్రి పట్టణాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మూడో విమానం ఏటీఆర్-72 అందుబాటులోకి రావడంతో కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు ట్రూజెట్ ఆ ప్రకటనలో పేర్కొంది.