కొత్తగా మరిన్ని నగరాలకు కనెక్టివిటీ
69 నుంచి 76 నగరాలకు విస్తరించిన డొమెస్టిక్ ఫ్లైట్స్
ఇంటర్నేషనల్ కనెక్టివిటీ సైతం విస్తరణ
సాక్షి, సిటీబ్యూరో: ఫ్లైట్ కనెక్టివిటీ విస్తరిస్తోంది. హైదరాబాద్ నుంచి మరిన్ని కొత్త నగరాలకు విమాన సరీ్వసులు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి 7 ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ నగరాలకు సైతం కనెక్టివిటీ క్రమంగా పెరుగుతోంది. దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ముఖ ద్వారం కావడంతో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఎప్పటికప్పు డు ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్త నగరాలకు సరీ్వసులను విస్తరించేందుకు పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
10 రోజుల్లోనే 7 కొత్త సరీ్వసులు
దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన సరీ్వసులు అందుబాటులో ఉన్నాయి. గత నెలలో కేవలం 10 రోజుల్లో 7 కొత్త సరీ్వసులను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రాజ్‌కోట్, అగర్తలా, జమ్మూ, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా నగరాలకు సరీ్వసులు అందుబాటులోకి వచ్చాయి. కొత్త సర్వీసుల్లో ఆక్యుపెన్సీ సైతం సంతృప్తికరంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. రాజ్‌కోట్‌కు ప్రతిరోజూ ఫ్లైట్ సర్వీసును ఏర్పాటు చేశారు. అగర్తలాకు వారానికి 3 సర్వీసులు నడుస్తున్నాయి. జమ్మూ కశీ్మర్‌కు ప్రారంభించిన విమాన సర్వీసులకు పర్యాటకుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి జమ్మూకు వారానికి మూడు సర్వీసుల చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో డొమెస్టిక్ కనెక్టివిటీ 69 నుంచి 76 నగరాలకు పెరిగినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి.
నిత్యం 60 వేల మంది ప్రయాణం..
👉 ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 60 వేల మంది దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగిస్తుండగా.. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, కోల్‌కతా నగరాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు.
👉 గోవా, విశాఖ, కొచ్చిన్, తిరుపతి, అహ్మదాబాద్ నగరాలకు సైతం హైదరాబాద్
నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి.
అయోధ్యకు పెరిగిన భక్తులు..
బాలరాముడు కొలువుదీరిన అయోధ్య రామజన్మభూమి ఆలయానికి నేరుగా రాకపోకలు సాగించేందుకు విమాన సరీ్వసులు లేకపోవడంతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. రైళ్లలో రద్దీ, సుదీర్ఘమైన ప్రయాణ సమయంతో ఒక్క అయోధ్య పర్యటనకే కనీసం మూడు నాలుగు రోజుల పాటు కేటాయించాల్సి వచ్చేది. మందిరం ప్రారంభించిన తర్వాత అన్ని వైపుల నుంచి భక్తుల రద్దీ పోటెత్తింది. కానీ ఇందుకనుగుణంగా ప్రయాణసదుపాయాలు మాత్రం విస్తరించలేదు. గత నెల 27వ తేదీ నుంచి సరీ్వసులు ప్రారంభమయ్యాయి. అయోధ్యతో పాటు భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రయాగ్‌రాజ్‌కు కూడా గత నెలలోనే విమాన సరీ్వసులు ప్రారంభమయ్యాయి. పర్యాటకుల డిమాండ్ ఎక్కువగా ఉన్న ఆగ్రాకు సైతం గత నెల 28 నుంచి సరీ్వసులు అందుబాటులోకి వచ్చాయి.
ఇంటర్నేషనల్ కనెక్టివిటీ విస్తరణ..
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం 18 అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 15 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా జర్మనీకి సరీ్వసులు ప్రారంభమయ్యాయి. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సర్వీసులు వారానికి 5 చొప్పున హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే బ్యాంకాక్, రియాద్, జెడ్డా, తదితర నగరాలకు సర్వీసులు పెరిగాయి. ఈ ఏడాది చివరి వరకు మరిన్ని నగరాలకు కొత్తగా సరీ్వసులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, డల్లాస్, మెల్‌బోర్న్, సిడ్నీ, పారిస్, ఆమ్‌స్టర్‌డ్యామ్ తదితర నగరాలకు కొత్తగా సరీ్వసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం దుబాయ్, సింగపూర్, అబుదాబి, లండన్ నగరాలకు ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment