
సాక్షి,మణికొండ( హైదరాబాద్): రెజ్లింగ్‌లో అంతర్జాతీయ రెఫరీగా నార్సింగి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన శ్రీకాంత్‌యాదవ్ ఎంపికయ్యారు. గత వారం రోజులుగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న ఆయన సత్తా చాటడంతో ఆయనను ఎంపిక చేశారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పోటీలకు రెఫరీగా పనిచేసే అవకాశం లబించిందని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.
అంతర్జాతీయ రెఫరీయింగ్ డైరెక్టర్ దుర్గే, ఒలంపిక్ రిఫరీ అశోక్‌ల చేతుల మీదుగా ఆయన తన అంతర్జాతీయ రెఫరీ దృవపత్రాన్ని అందుకున్నానని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రెజ్లింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే అవకాశం మాత్రమే ఉండేదని, తన ఎంపికతో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసి అవకాశం లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment