
విమానాశ్రయం (గన్నవరం): గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌ఇండియా సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా జూలై 20 నుంచి ఒమాన్ దేశ రాజధాని మస్కట్‌కు డైరెక్ట్ విమాన సర్వీస్‌ను ఎయిర్‌ఇండియా ప్రారంభించనుంది.
ఎయిర్‌బస్ ఎ–321 విమానం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఒమాన్ దేశ కాలమానం ప్రకారం మస్కట్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని ఎయిర్‌ఇండియా వర్గాలు తెలిపాయి. వారంలో ఒక రోజు మాత్రమే నడిచే ఈ సర్వీస్‌కు సంబంధించి ఆ సంస్థ ఇప్పటికే ప్రయాణ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు టిక్కెట్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment