ఉద్రిక్తతల ఎఫెక్ట్‌ : పలు విమానాలు రద్దు | Jet Airways IndiGo SpiceJet  GoAir cancel several flights after | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతల ఎఫెక్ట్‌ : పలు విమానాలు రద్దు

Published Wed, Feb 27 2019 2:41 PM | Last Updated on Sun, May 19 2024 11:38 AM

Jet Airways IndiGo SpiceJet  GoAir cancel several flights after - Sakshi

దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక‍్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా  విమాన సేవలు తీవ్రంగా  ప్రభావితమయ్యాయి. గగనతల ఉద్రికత్తలు, కఠిన నిబంధనలతో పలు విమాన సంస్థలు ఇప్పటికే అనేక సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించాయి.  సివిల్ ఎయిర్ ట్రాఫిక్ కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌,  గోఎయిర్‌,  ఇండిగో, స్పైస్‌ జెట్‌  పలు సర్వీసులను రద్దు చేశాయి. 

శ్రీనగర్, అమృత్‌సర్‌, డెహ్రాడూన్, జమ్మూ, చండీగఢ్, ఇతర విమానాశ్రయాల మూసివేత కారణంగా తాత్కాలికంగా సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ పరిణామాలకనుగుణంగా  ప్రయాణికులు వ్యవహరించాలని విజ్ఙప్తి చేశాయి.  ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే తమ రిజర్వేషన్లను అప్‌డేట్‌ చేసుకోవచ్చని గోఎయిర్‌ ప్రకటించింది.  ఇందుకు టోల్‌ ఫ్రీ నెంబరు 18602 100 999ను  ట్వీట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement