మాస్కో: పుట్టినరోజు అంటే శుభాకాంక్షలతో సరిపెట్టుకునే రోజులు పోయాయి. హంగూఆర్భాటాలతో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేయాలి. ఎక్కువ సంఖ్యలో అతిథులను పిలవాలి. వచ్చిన వాళ్లు ఆ పార్టీ కోసం గొప్పలు చెప్పుకునేటట్లు ఏదైనా కొత్తగా చేయాలి. పుట్టిన రోజు వేడుకల్లో ఈ కొత్త పోకడలు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో బర్త్‌డే జరుపుకుంటున్న ఓ వ్యక్తి చేసిన స్టంటు అతన్ని ఆసుపత్రిపాలయ్యేలా చేసిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. మాస్కోకు చెందిన డిమిర్టీ ప్రిగారోడోవ్ అనే బ్యాంకు ఉద్యోగి తన 30వ పుట్టినరోజున స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. (25 మందికి వైరస్ పంచిన చిరు పార్టీ)
ఈ క్రమంలో అతను కిటికీలో నుంచి స్విమ్మింగ్ పూల్‌లో దూకి జలకాలాడాలన్న ఆలోచన పుట్టింది. తాగిన మైకమో, లేదా పార్టీలో మునిగి ప్రపంచాన్ని మర్చిపోయాడో కానీ పూల్ మీద గాజు ఫలకం ఉందని గుర్తించలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా అందులోకి దూకడంతో గాజు పలిగిపోయి అతని శరీరానికి గుచ్చుకుంది. ముఖం, ఛాతీపై తీవ్ర గాయాలలవడంతో పాటు ఎడమ చేయి, కాలు పనిచేయడం లేదు. బర్త్‌డే మిగిల్చిన విషాదాన్ని గురించి డిమిట్రీ మాట్లాడుతూ.. "నేను పుట్టినరోజు జరుపుకునేందుకు మంచి ప్లేస్ ఎంచుకుని దాన్ని అద్దెకు తీసుకున్నాం. అక్కడ మద్యం సేవిస్తూ పార్టీ చేసుకున్నాం. కానీ ఆ స్విమ్మింగ్ పూల్‌ను చూస్తే దూకడానికి అనుగుణంగానే ఉందనిపించింది" అని పేర్కొన్నాడు. (వూహాన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్)
Comments
Please login to add a commentAdd a comment