మాస్కో: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ భూభాగం నుంచి ఉగ్రవాదం పెరిగిపోతుందని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ పరిణామాలపై చర్చించడానికి రష్యా ఈ నెల 20న ఒక అంతర్జాతీయ సదస్సుని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సదస్సుకి తాలిబన్లను కూడా ఆహ్వానిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ చెప్పినట్టుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి.
తమ భూభాగంలోకి ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎక్కడ చొరబడతారోనన్న ఆందోళనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రఖ్‌మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మధ్య ఆసియాలో భద్రతా పరిస్థితులపై చర్చించారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment