
మాస్కో ఎయిర్ పోర్ట్ లో మంటలు
రష్యా రాజధాని మాస్కోలోని డొమెదెడొవో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని డొమెదెడొవో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాగేజ్ సెక్టార్ లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది 3 వేల మంది ప్రయాణికులను విమానాశ్రయం నుంచి బయటకు పంపారు. అగ్నిప్రమాదంతో 60 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
విమానాశ్రయంలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మంటలు అంటుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాక ప్రయాణికులను తిరిగి ఎయిర్ పోర్టులోకి అనుమతిస్తామని అత్యవసర విభాగం అధికారులు ప్రకటించారు.