అక్కడ అన్నీ డబుల్ డబుల్! | There are all double-double! | Sakshi
Sakshi News home page

అక్కడ అన్నీ డబుల్ డబుల్!

Published Sun, Mar 2 2014 10:33 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

అక్కడ అన్నీ డబుల్ డబుల్! - Sakshi

అక్కడ అన్నీ డబుల్ డబుల్!

రష్యాలోని మాస్కోలో ట్విన్ స్టార్స్ అనే రెస్టారెంట్ ఉంది. ఇది కవలల కోసమే పెట్టిన రెస్టారెంట్ అనుకునేరు. అదేం కాదు. మనం సింగిల్‌గానే వెళ్లొచ్చు. కానీ అక్కడ గేట్ కీపర్ల దగ్గర్నుంచి సర్వర్లు, స్వీపర్లు, క్యాషియర్లు, మేనేజర్లు అందరూ కవలలే .
 
మనం పిలిస్తే  ఇద్దరు పలుకుతారు. ఆర్డర్ ఇస్తే ఇద్దరు తీసుకొస్తారు. బిల్లు ఇద్దరు కట్టించుకుంటారు. కవలల్నే ఎందుకు పెట్టారు అని రెస్టారెంటు యజమాని ‘అలెక్సీ ఖోడ్రోవ్‌స్కీ’ని గానీ అడిగామే అనుకోండి... ఊరికే సరదాగా అంటాడు. ఆయన ఎప్పుడో కవలల కథతో తీసిన సినిమా చూశాడట. అప్పుడే ఈ వింత ఐడియా వచ్చిందట.

ఈ కవలలందరికీ అలెక్సీ ఇచ్చిన ఆదేశాలు విచిత్రంగా ఉంటాయి. కవలలిద్దరూ ఒకేలా ప్రవర్తించాలి. ఒకరు ఏది చేస్తే రెండోవారూ అదే చేయాలి. ఉదాహరణకు... ఒకరు చెంచా కింద పడేశారనుకోండి, రెండోవాళ్లు కూడా పడేయాలి. ఎందుకంటారా... కస్టమర్లను కన్‌ఫ్యూజ్ చేసి థ్రిల్‌కి గురి చేసేందుకట. వినడానికి కాస్త విడ్డూరంగా ఉంది కానీ... వ్యాపారం మాత్రం బాగానే నడుస్తోంది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement