మాస్కో: రష్యా రాజధాని మాస్కోపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం డ్రోన్లను ప్రయోగించిందా? నిజమేనని చెబుతోంది రష్యా వైమానిక దళం. ఉక్రెయిన్ ప్రయత్నాన్ని భగ్నం చేశామని వెల్లడించింది. ఉక్రెయిన్ సైన్యం మంగళవారం ఐదు డ్రోన్లు ప్రయోగించిందని, వెంటనే ఈ విషయం గుర్తించి మాస్కోలో ఒక విమానాశ్రయాన్ని మూసివేశామని రష్యా ఆర్మీ తెలియజేసింది. మరికొన్ని విమానాలను దారి మళ్లించామని పేర్కొంది.
మాస్కోలో గతంలోనూ పలుమార్లు డ్రోన్ దాడులు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు యత్నం విఫలమైన తర్వాత డ్రోన్‌తో దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయతి్నంచడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ సైన్యం ఐదు డ్రోన్లను ప్రయోగించగా, వాటిలో నాలుగింటిని కూల్చివేశామని, మరో డ్రోన్‌ను సురక్షితంగా కిందికి దింపామని రష్యా రక్షణ శాఖ తెలియజేసింది. ఈ దాడులతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని మాస్కో మేయర్ సెర్గీ సొబ్‌యానిన్ చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment