కీవ్: ఆక్రమిత క్రిమియాపై డ్రోన్ల దాడిని తిప్పికొట్టినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ప్రయోగించిన సుమారు 20 డ్రోన్లను కూల్చివేసినట్లు శనివారం రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇందులో 14 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేయగా మరో ఆరింటిని జామర్లు నిర్వీర్యం చేశాయని వెల్లడించింది. ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ స్పందించలేదు.
వరుసగా మూడు రోజులుగా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులు జరగడంతో రష్యా అప్రమత్తమైంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్ ప్రాంతానికి చెందిన ఉరోజ్‌హయిన్ అనే గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా శనివారం ప్రకటించుకుంది. ఖర్కీవ్, జపొరిజియా ప్రాంతాలతోపాటు, అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణం క్రివ్విరిహ్‌ల్లో జరిగిన రష్యా బాంబు దాడుల్లో ఇద్దరు చనిపోగా మరో 16 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ యంత్రాంగం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment