![Russia-Ukraine War: Russia destroys Ukrainian drones including over Moscow - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/27/dron12.jpg.webp?itok=zmNW0JAv)
మాస్కో: మాస్కో లక్ష్యంగా డజన్ల కొద్దీ డ్రోన్లతో ఉక్రెయిన్ ఆదివారం దాడికి యత్నించినట్లు రష్యా ఆరోపించింది. శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి రష్యా 60కి పైగా డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆదివారం మాస్కో పరిసర ప్రాంతాలపైకి దూసుకొచి్చన 24 వరకు ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది. మాస్కోలోని మూడు వేర్వేరు చోట్ల జరిగిన డ్రోన్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని గవర్నర్ ఆండ్రీ ఒవొబియెవ్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన ఉన్న తుల నగరంలోని 12 అంతస్తుల అపార్టుమెంట్‌ను ఒక డ్రోన్ ఢీకొట్టగా ఒకరు గాయపడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment