సముద్రంలో కూలిన విమానం
మాస్కో: రష్యాలో రక్షణ శాఖకు చెందిన గల్లంతైన విమానం సముద్రంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. నల్ల సముంద్రంలో విమానశకలాలు గుర్తించినట్లు రష్యా మీడియా వెల్లడించింది.
టీయూ-154 మిలిటరీ విమానం సోచి నుంచి సిరియా సముద్రతీర నగరం లటాకాకు బయలు దేరింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:20 గంటలకు సోచిలో టేకాఫ్ అయిన విమానం.. 5:40 గంటలకు రాడార్ నుంచి తప్పిపోయినట్లు ఎమర్జెన్సీ మినిస్ట్రీ అధికారులు వెల్లడించారు. విమానంలో జర్నలిస్టులు, సైనికాధికారులు, మ్యుజీషియన్స్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం విమానంలో 83 మంది ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది ఉన్నారు.