మాస్కో: పాఠశాలకు వెళ్లేది విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు.. కానీ ఇక్కడ మాత్రం విద్యార్థులు ఒకరినొకరు కత్తులతో తలపడేందుకు వెళ్లినట్లుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాలోని ఓ పాఠశాలలో ఇద్దరి మధ్య జరిగిన కత్తుల యుద్ధం జరిగింది. ఈ సంఘటనలో 14మంది విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు. పెర్మ్ సిటీ ఉరల్ పర్వతాల్లోని ఓ సెకండరీ పాఠశాలలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు కత్తులతో యుద్ధానికి తలపడ్డారని విచారణ కమిటీ పేర్కొంది. ఈ సంఘటనతో విద్యార్థులను, టీచర్లను వెళ్లగొట్టి తరగతులను రద్దు చేశారు. అనుమానాస్పదులను పట్టుకుని విచారిస్తున్నారు. ఒక టీచర్, 15ఏళ్లు, 16 ఏళ్లు ఉన్న ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, వీరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటనను ఉటంకిస్తూ అక్కడి పత్రిక తెలిపింది. మిగతా వారికి వైద్య సహాయం అందిస్తున్నారంది.
Comments
Please login to add a commentAdd a comment