రష్యాలో మోదీకి ఘన స్వాగతం.. హిందీ పాటకు డ్యాన్స్‌లతో.. | Prime Minister Narendra Modi Arrives Moscow In Russia | Sakshi
Sakshi News home page

రష్యాలో మోదీకి ఘన స్వాగతం.. హిందీ పాటకు డ్యాన్స్‌లతో..

Jul 8 2024 8:06 PM | Updated on Jul 8 2024 8:30 PM

Prime Minister Narendra Modi Arrives Moscow In Russia

మాస్కో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ రష్యాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ రాక సందర్భంగా రష్యన్‌ డ్యాన్స్‌ ట్రూప్‌ ప్రత్యేకంగా దాండియా, గర్భా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలికింది.

ఇక, మాస్కోలో ల్యాండ్‌ అయిన తర్వాత మోదీ ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ట్విట్టర్‌లో..‘మాస్కో దిగాను. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా భవిష్యత్ సహకార రంగాలలో మన దేశాల మధ్య బలమైన సంబంధాలు మన ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక, మోదీ కోసం పుతిన్‌ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఇక, రష్యా పర్యటనను ముగించుకుని మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement