ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పకీ రష్యాలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కారణాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ తీవ్రతని ప్రపంచ దేశాలు గుర్తించక ముందే రష్యా గుర్తించింది. తొలి కేసు కూడా నమోదు కాకుండానే జనవరి 30న చైనాతో సరిహద్దుల్ని మూసేసింది. జనవరి 31న రష్యాలో రెండు కేసులు నమోదయ్యాయి. మార్చి 13 తర్వాత ఐరోపా దేశాలతో కూడా రాకపోకలు నిలిపివేసింది. కానీ దేశంలో లాక్‌డౌన్ అమలు చేయడంలో ఆలస్యం చేసింది. మార్చి 28 వరకు లాక్‌డౌన్ ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత కూడా కఠినంగా అమలు చేయడంలో విఫలమైంది. చదవండి: హోంవర్క్‌లో డౌట్స్ వస్తే నేనున్నా: ప్రధాని
ప్రజలు బయటకొచ్చి ఇష్టారాజ్యంగా తిరగడం, ప్రజల్లో ఈ వైరస్ ఎంత ప్రమాదకారో పూర్తిగా అవగాహన కొరవడడం వంటి కారణాలతో కేసులు పెరిగిపోయాయి. ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్‌ను కూడా దాటేసి ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అయిదో స్థానానికి ఎగబాకింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న రష్యాలో ఇప్పటిదాకా 221,344 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2,009కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,656 కేసులు నమోదయ్యాయి.
రష్యా రాజధాని మాస్కోలో పరిస్థితి దారుణంగా ఉంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాలలో సగం వరకు ఇక్కడ నుంచే ఉండడం ఆందోళన కలిగించే విషయం. సోమవారం రోజున కొత్తగా 6,169 కేసులు పెరిగాయి. దీంతో అధికారిక లెక్కల ప్రకారం మాస్కోలో కేసల సంఖ్య 1,15,909 కు చేరుకుంది. దీంతో రష్యా ఇప్పుడు బ్రిటన్, ఇటలీలను దాటేసి మూడో స్థానాన్ని ఆక్రమించింది. అయితే, అధిక సంఖ్యలో టెస్టులు జరపుతుండడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 56 లక్షల టెస్టులు జరిపినట్టు వారు తెలిపారు. చదవండి: సడలింపులపై దృష్టి పెట్టండి: మోదీ
Comments
Please login to add a commentAdd a comment