మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీలో భారతీయులు సైతం పనిచేస్తున్నారు. ఇటీవల యుద్ధ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికులు జరిపిన దాడిలో రష్యా ఆర్మీలో పని చేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించారు.
అయితే రష్యా పర్యటనలో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చించారు. అనంతరం తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా అంగీకరిస్తున్నట్లు పుతిన్ చెప్పారంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఏజెంట్ల చేతిలో మోసం
కొంతకాలం క్రితం విదేశాల్లో భారీ మొత్తంలో జీతాలు చెల్లిస్తామంటూ పలువురు ఏజెంట్లు సుమారు 12 మంది భారతీయుల్ని మోసపూరితంగా హద్దులు దాటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యా ఆర్మీకి సహాయంగా పంపించారు.
రష్యా ఆర్మీ ధరించి
అందుకు ఊతం ఇచ్చేలా ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్, హర్యానాలకు చెందిన వారు రష్యా ఆర్మీ ధరించి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న వీడియోలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో ఎక్కువ శాలరీ వస్తుందనే ఆశతో ఏజెంట్లను ఆశ్రయిస్తే వాళ్లు తమని అక్రమంగా రష్యా ఆర్మీలోకి జాయిన్ చేయించినట్లు తెలిపారు. వేరే గత్యంతరం లేక రష్యా ఆర్మీలో పని చేస్తున్నామని, తమని రక్షించమని కోరుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోపై కేంద్రం స్పందించింది. అక్రమంగా రష్యా ఆర్మీలో పనిచేస్తున్న రక్షించేలా పుతిన్‌ను సంప్రదిస్తామని హామీ ఇచ్చింది. తక్షణ చర్యల్లో భాగంగా పౌరుల్ని మోసం చేస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
రష్యాలో భారత్ దౌత్య విజయం
తాజా పర్యటనలో మోదీ రష్యా ఆర్మీలో భారతీయుల అంశంపై పుతిన్ చర్చించడం, అందుకు ఆయన భారతీయుల‍్ని విడుదల చేసేందుకు విముఖత వ్యక్తం చేయడం రష్యాలో భారత్ దౌత్య విజయం సాధించినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment