బంగారంతో టాయిలెట్‌.. బయట పడ్డ బండారం..! | Russian Investigators Recently Uncovered A Golden Toilet At A Police Officers Home | Sakshi
Sakshi News home page

బంగారంతో టాయిలెట్‌.. బయట పడ్డ బండారం..!

Published Thu, Jul 22 2021 10:26 PM | Last Updated on Thu, Jul 22 2021 10:47 PM

Russian Investigators Recently Uncovered A Golden Toilet At A Police Officers Home - Sakshi

లంచం వ్యవస్థకు పట్టిన ఓ చీడ. పురుగు పట్టిన చెట్టు క్షీణించనట్టే.. అవినీతి వల్ల పేదవాడు.. మరింత పేదరికంలోకి జారుకుంటాడు. రోజంతా కష్టపడితే పూట గడిచే బతుకులు ఓ వైపు.. బల్ల కింద చేతులు పెట్టి కోట్లకు పడిగెత్తే వారు మరోవైపు. ఈ డబ్బు మనుషుల మధ్య ఎన్నో  వ్యత్యాసాలను సృష్టిస్తుంది.

మాస్కో: రష్యాలో ఓ ట్రాఫిక్‌ పోలీసు అధికారిపై అవినీతి ఆరోపలు వచ్చాయి. దీనిపై పరిశోధన చేపట్టిన రష్యా అధికారులకు విస్తుపోయే అనుభవం ఎదురైనది. పోలీసు అధికారి అవినీతి సొమ్ముతో ఏకంగా గోల్డెన్ టాయిలెట్‌ను కట్టించాడు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని దక్షిణ స్టావ్‌రోపోల్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు అధికారి కల్ అలెక్సీ సఫోనోవ్.. వ్యాపారాలకు నకిలీ అనుమతులు జారీ చేసినందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనిపై  రష్యా అధికారులు విచారణ చేపట్టారు. అతడితో పాటు మరో 35 మంది అధికారులు ఓ  ‘మాఫియా ముఠా’ నడుపుతున్నట్లు గుర్తించారు. అయితే అవినీతి అధికారి ఇంటికి సంబంధించిన ఫోటోలు, సీసీ ఫుటేజ్‌ వీడియో లీక్‌ అయ్యాయి. ఈ వీడియోలో ఓ పెద్ద భవనంలో విలాసవంతమైన గదులు, అతి ఖరీదైన వస్తువులతో అలంకరణలు, బిలియర్డ్స్ హాల్, బంగారు బిడెట్, సింక్‌, బంగారు మరుగుదొడ్డి ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ వీడియాలో తెగ వైరలవుతోంది.  

ప్రతిపనికి అవినీతే!
ఈ ముఠా కొన్ని సంవత్సరాలు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్‌ నంబర్ ప్లేట్లు, కార్గో పర్మిట్‌ల నుంచి ఇసుక డెలివరీల  వరకు ప్రతిదానికి అవినీతికి పాల్పడుతున్నట్లు వినికిడి. దీనికి సంబంధించి 35 మందికి పైగా ట్రాఫిక్‌ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు యునైటెడ్‌ రష్యా పార్టీలోని ఎంపీ అలెగ్జాండర్ ఖిన్షెయిన్ అన్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా రెండు లక్షల యాభై ఐదు వేల డాలర్లు దోచుకున్నట్లు సమాచారం. ఇక సఫోనోవ్‌ దోషిగా తేలితే 8 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement