పేలిన విమానం ..ఇద్దరి మృతి | Two Dead After Russian Plane Makes Emergency Landing Over Runaway | Sakshi
Sakshi News home page

పేలిన విమానం ..ఇద్దరి మృతి

Published Thu, Jun 27 2019 8:49 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Two Dead After Russian Plane Makes Emergency Landing Over Runaway - Sakshi

మాస్కో : ఇంజన్‌ ఫెయిలవడంతో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యే సమయంలో  విమానం పేలిన ఘటన సైబీరియాలోని బుర్యేతియా ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ విమానం రష్యాకి చెందిన ఆంటోనోవ్‌ ఏఎన్‌-24గా గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఉలాన్‌-ఉడే నుంచి ఐదుగురు సిబ్బంది, 48మంది ప్రయాణికులతో నిజ్నియాన్‌గార్క్స్‌కు ఏఎన్‌-24 విమానం బయలుదేరిందని తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో బుర్యేతియా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌ యత్నించాడని.. ఆ సమయంలో విమానం రన్‌వేను బలంగా తాకడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. కాగా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారని, మరణించిన వారిలో ఒకరు పైలట్‌, మరొకరు టెక్నీషయన్‌ అని అధికారులు ధ్రువీకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement