
‘‘కూర్చున్న చోటే స్కెచ్ వేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటకు లాక్కొచ్చాడంటే వాడెంత తోపై ఉంటాడు’’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్. దర్శక–నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.
ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ‘ఠాగూర్’ మధు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఒకడి జీవితంలో ఏవేవి జరగకూడదో అవన్నీ రుద్ర జీవితంలో జరిగాయి’, ‘మావ.. మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతోంది రా.. మనమే వెతకాలి. మనమే కనిపెట్టాలి. మనమే కొట్టాలి’ అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి.
‘‘కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు లారెన్స్. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్‌ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్‌కుమార్ అతని లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కష్టాలు మొదలవుతాయి. అయినప్పటికీ దృఢంగా నిలబడి, క్రిమినల్‌ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment