సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలోని తాజా వార్తలు, కథనాలు, ప్రాజెక్ట్‌లు, ట్రెండ్స్ వంటివి ఎప్పటికప్పుడు పాఠకులకు అందించేందుకు రియల్టీకబర్.కామ్ సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని స్థిరాస్తి రంగ సమాచారాన్ని తెలుగులో అందించడమే దీని ప్రత్యేకత అని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ దేశాల్లోని తెలుగు పాఠకులు సులువుగా చదువుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశీయ నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నివేదికలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అన్ని రకాల అంశాలతో కూడిన కథనాలను అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment