'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిని ఆస్కార్ అవార్డు ఆలస్యంగానే వచ్చిందని కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి ఎల్.మురుగన్ అన్నారు. నిర్మాత కేటీ కుంజుమన్ 1993లో నిర్మించిన చిత్రం జెంటిల్‌మెన్. నటుడు అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం అప్పట్లో సంచల విజయాన్ని సాధించింది. 30 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. దీనికి గోకుల్ కృష్ణ దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
(ఇదీ చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్)
చేతన్ శీను, నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈచిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం చైన్నె ఎగ్మూర్‌లోని రాజా ముత్తయ్య హాల్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్న ఈ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణిని ఘనంగా సత్కరించారు. కేంద్రమంత్రి మురుగన్ మాట్లాడుతూ.. తమిళ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని అన్నారు.
తమిళ ఇండస్ట్రీ ఇలా పేరు తెచ్చుకోవడంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ పాత్ర చాలా ఉందని గుర్తుచేసుకున్నారు. నిర్మాత కుంజుమన్ మంచి చిత్రాలను నిర్మిస్తున్నారని, సంగీత దర్శకుడు కీరవాణి 33 ఏళ్లుగా సంగీత రంగంలో ఉన్నారని అన్నారు. ఆయనకు ఆస్కార్ అవార్డు ఎప్పుడో రావాల్సిందని, ఇప్పుడు కొంచెం ఆలస్యంగా వచ్చిందనే అభిప్రాయాన్ని మురుగన్ వ్యక్తం చేశారు. ఆయన్ని ఆశీర్వదించడానికి తనకు వయస్సు చాలదని చెప్పుకొచ్చారు. జెంటిల్‌మెన్ సీక్వెల్ చిత్రం ఘనవిజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment