
చెన్నై: కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ నటుడు సూర్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూరరై పోట్రు చిత్రం, కథానాయకుడిగా చేసిన సూర్య గురించి మాట్లాడారు. ‘నేను ఇటీవల సూరరై పోట్రు చిత్రం చూశాను. అందులో నటనకు సూర్యకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అందుకు ఆయన అర్హుడు. నేను కలిసిన అరుదైన నటుల్లో సూర్య ఒకరు. చాలా నిజాయితీ గల వ్యక్తి’ అని అన్నారు. కాగా నటుడు సూర్య నటించి నిర్మించిన చిత్రం సూరరై పోట్రు ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment