91వ ఆస్కార్ అవార్డు వేడుకలకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ వేడుక వచ్చే నెల 24న జరగనుంది. ఈ అవార్డుల బరిలో ఏయే చిత్రాలు నిలబడతాయి? ఏయే నటీనటులు, సాంకేతిక నిపుణులు నిలబడతారు? అనే ఆసక్తి గత కొన్నాళ్లుగా నెలకొంది. మంగళవారం (భారతీయ కాలమానం ప్రకారం రాత్రి సుమారు 7 గంటలకు) నామినేషన్స్‌ను విడుదల చేశారు. ‘ద ఫేవరెట్, నెట్‌ఫ్లిక్స్ రోమా’ చిత్రాలకు పది నామినేషన్స్ దక్కడం విశేషం. ‘ద స్టార్ ఈజ్ బోర్న్, వైస్’ చిత్రాలు 8, ‘బ్లాక్ ప్యాంథర్’ ఏడు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్‌గా ‘బ్లాక్ ప్యాంథర్’ నిలిచింది. ఇక.. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న విభాగాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
ఉత్తమ చిత్రం: బ్లాక్ ప్యాంథర్, బ్లాక్లాంన్స్‌మాన్, బొహెమియాన్ రాప్సోడి, ది ఫేవరెట్, గ్రీన్‌బుక్, రోమా, ఏ స్టార్ ఈజ్ బోర్న్, వైస్.
ఉత్తమ నటుడు: క్రిస్టియన్ బాలే (వైస్), బ్రాడ్లీ కూపర్ (ఏ స్టార్ ఈజ్ బోర్న్), విలియమ్ దఫోయ్ (ఎట్ ఇటర్నిటీస్ గేట్), రామీ మాలిక్ (బొహెమియాన్ రాప్సోడి), విగ్గో మార్టెన్‌సెన్ (గ్రీన్ బుక్).
ఉత్తమ నటి: యలిట్జా అపారిసియో (రోమా), గ్లెన్ క్లోజ్ (ది వైఫ్), ఒలివియా కోల్మన్ (ద ఫెవరెట్), లేడీ గగా ( ఏ స్టార్ ఈజ్ బోర్న్), మెలిస్సా మెకర్తీ(కెన్ యు ఎవర్ ఫర్‌గివ్ మీ?).
ఉత్తమ దర్శకుడు: స్పైక్ లీ (బ్లాక్లాంన్స్‌మాన్), పావెల్ పౌలీకోస్కీ(కోల్డ్‌వార్), యోర్గోస్ లాంతిమోస్ (ది ఫేవరెట్), అల్ఫోనో క్వారోన్ (రోమా)
ఆడమ్ మెక్కే (వైస్).
ఉత్తమ సహాయనటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్), ఆడమ్ డ్రైవర్ (బ్లాక్లాంన్స్‌మాన్), సామ్ ఎల్లియోట్ (ఏ స్టార్ ఈజ్ బోర్న్), రిచర్డ్ ఈ గ్రాంట్ (కెన్ యు ఎవర్ ఫర్‌గివ్ మీ?), సామ్ రాక్‌వెల్ (వైస్).
ఉత్తమ సహాయనటి: అమీ ఆడమ్స్ (వైస్), మరినా డిటవీరా (రోమా), రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్), ఎమ్మా స్టోన్ (ది ఫేవరెట్), రాచెల్ వీజ్ (ది ఫేవరెట్)
ఉత్తమ విదేశీ చిత్రం: కేపర్నామ్ (లెబనాన్), కోల్డ్ వార్ (పోల్యాండ్), నెవర్ లుక్ అవే (జర్మనీ), రోమా (మెక్సికో), షాప్ లిఫ్టర్స్ (జపాన్)
ఇంకా ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైన్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్.. ఇలా మొత్తం 24 విభాగాలకు నామినేషన్లు ప్రకటించారు.పోటీదారులకు ఒక మెట్టు పూర్తయింది. మరో మెట్టు ‘అవార్డు వేదిక’. మరి.. బరిలో నిలిచినవాళ్లల్లో ఆ మెట్టుని కూడా విజయవంతంగా ఎక్కేదెవరో వేచిచూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment