సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ ఆస్కార్ వేడుక. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు ఆస్కార్ బరిలో నిలవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు సినిమాలు పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో ఫైనల్‌కు చేరిన పాటలు మొత్తం ఐదు ఉన్నాయి. వాటిలో ‘నాటు నాటు’తో పాటు 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), 'హోల్డ్ మై హ్యాండ్' (టాప్‌గన్.. మావెరిక్), 'లిఫ్ట్ మీ అప్'(బ్లాక్ పాంథర్), 'దిస్ ఈజ్ ఎ లైఫ్' (ఎవ్రీథింగ్ ఎవీవ్రేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు పోటీలో నిలిచాయి. వీటిల్లో మార్వెల్ సూపర్ హీరో చిత్రం ‘బ్లాక్‌పాంథర్: వకాండా ఫరెవర్’లో రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట, టామ్ క్రూజ్ హీరోగా వచ్చిన ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట.. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో కూడా మన ‘నాటు నాటు’ పాటకు గట్టి పోటీ ఇచ్చాయి. కానీ చివరికీ మన పాటనే విజయం వరించింది.
చదవండి: ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా?
అయితే అస్కార్ బరిలోనూ నిలిచిన ఆ సాంగ్ నాటు నాటు సాంగ్‌కు రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే కాకుండా 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. అమెరికాలో థియేటర్లలోనూ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
14 పాటలతో పోటీపడిన ‘నాటు నాటు’ సాంగ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యాలు సమకూర్చిన ‘నాటు నాటు’ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 81 పాటలు బరిలో నిలవగా ఫైనల్‌గా 15 పాటలు మాత్రమే షార్ట్‌లిస్ట్‌లో చేరాయి. అందులో ‘నాటు నాటు’ పాటకి చోటు దక్కింది. భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన తొలి పాట ఇదే.
చదవండి: Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..
Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు!
Comments
Please login to add a commentAdd a comment