సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్. ప్రతి ఏటా అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సినిమాలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రెటీలంతా అమెరికాకు క్యూ కడుతున్నారు. ఈసారి మన తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంత ఈ అవార్డు కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చదవండి: కేజీయఫ్ వివాదంపై స్పందించిన డైరెక్టర్, సమర్థించుకుంటూనే క్షమాపణలు..
ఈ క్రమంలో వారందరిని సర్‌ప్రైజ్ చేసే ప్రకటన బయటకు వచ్చింది. ఈ ఏడాది జరిగే 95వ ఆస్కార్ అవార్డు ఈవెంట్‌ను లైవ్‌లో చూసే అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫ్లాం డిస్నిప్లస్ హాట్‌స్టార్ అస్కార్ అవార్డు ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. నిన్న సోమవారం దీనిపై హాట్‌స్టార్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇది మార్చి 13న ఉదయం 5:30 గంటల నుంచి హాట్‌స్టార్ లైవ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు ఈ సందర్భంగా తెలిపింది. కాగా ఆస్కార్స్ వేడుక వచ్చే ఆదివారం (మార్చి 12, భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున) జరగనుంది.
చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా?
ఈ సారి అకాడెమీ అవార్డులు ఇండియన్స్‌కు మరింత ఆసక్తి రేపుతోంది. దీనికి కారణం మన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ కావడమే. ఈ పాటకు ఆస్కార్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఇదే వేదికపై ఈ పాట లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. దీనికితోడు ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకోనే అవార్డు ప్రజెంటర్లలో ఒకరిగా వ్యవహరించనుంది. ఈ వేడుకల్లో ఆమె ఓ అవార్డును ప్రజెంట్ చేయనుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా నిలవడం విశేషం.
Movies are dreams you can never forget.
— Disney+ Hotstar (@DisneyPlusHS) March 6, 2023
Come celebrate the dream makers at the 95th Oscars🎥#Oscars95
Streaming on March 13, 5:30 AM. pic.twitter.com/UaZmse9Tif
Comments
Please login to add a commentAdd a comment