MS Dhoni gifts CSK number 7 jersey to 'The Elephant Whisperers' Bomman and Bellie - Sakshi
Sakshi News home page

#MSDhoni: ఆస్కార్‌ గెలిచిన వీరులతో ఎంఎస్‌ ధోని

Published Wed, May 10 2023 6:54 PM | Last Updated on Wed, May 10 2023 7:21 PM

MS Dhoni Gifts CSK Number-7 Jersey Elephant Whisperers-Team-Won-Oscar - Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ధోని నేతృత్వంలోని సీఎస్‌కే ఐదోసారి టైటిల్‌ కొల్లగొట్టేందుకు ఉవ్విళ్లూరుతుంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 13 పాయింట్లతో ఉన్న ధోని సేన రెండో స్థానంలో కొనసాగుతుంది.  కాగా ఇవాళ(బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. 

ఇక బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో భారతీయ చిత్రం 'ఎలిఫెంట్‌ విస్పరర్స్‌(Elephant Whisperers)' ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమన్‌, బెల్లీలను, దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌ను ఎంఎస్‌ ధోని బుధవారం ప్రత్యేకంగా కలుసుకున్నాడు.

ఈ సందర్భంగా సీఎస్‌కే జెర్సీలను వారికి గిఫ్ట్‌గా బహుకరించాడు. ఇక్కడ విశేషమేంటంటే ధోని జెర్సీ నెంబర్‌ అయిన '7'తో  వారి పేర్లను ముద్రించి కానుకగా అందించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: ODI WC 2023: హైదరాబాద్‌లో టీమిండియా-పాక్‌ మ్యాచ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement