Shah Rukh Khan Tweet To Ram Charan For RRR Movie Oscars 2023 Entry - Sakshi
Sakshi News home page

Sharukh Khan Tweet : ఒక్కసారి ‍అలా చేయనివ్వండి.. రామ్ చరణ్‌కు షారూక్ రెక్వెస్ట్

Published Tue, Jan 10 2023 3:29 PM | Last Updated on Tue, Jan 10 2023 4:57 PM

Sharukh Khan Tweet To Ram Charan On RRR Oscar Entry  - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ కావడాన్ని కొనియాడారు. దీనిపై స్పందిస్తూ మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ఇండియాకు తీసుకొస్తే తాకేందుకు తనకు అవకాశమివ్వాలని షారూక్ విజ్ఞప్తి చేశారు. 

షారూక్ తన ట్వీట్‌లో రాస్తూ..' మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ధన్యావాదాలు. మీ ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ఇండియాకు తీసుకొస్తే.. ఆ అవార్డును తాకేందుకు నాకు అవకాశమివ్వండి' అంటూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్‌తో పాటు కాంతార, ది కశ్మీర్ ఫైల్స్, గంగుభాయ్ కతియావాడి ఆస్కార్ బరిలో నిలిచాయి. ఈ ఏడాది మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 

కాగా.. బాలీవుడ్‌ ‘బాద్‌షా’ షారుక్ ఖాన్‌, బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ పఠాన్‌. ఎన్నో వివాదాల అనంతరం ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ కూడా విడుదల చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement