తడబడినా భలే గమ్మత్తుగా కవర్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ! | Liza Koshy Triumphs Over Red Carpet Mishap | Sakshi
Sakshi News home page

ఆస్కార్ 2024: రెడ్‌ కార్పెట్‌పై తడబడినా..భలే గమ్మత్తుగా కవర్‌ చేసిన నటి!

Published Mon, Mar 11 2024 4:40 PM | Last Updated on Mon, Mar 11 2024 4:53 PM

Liza Koshy Triumphs Over Red Carpet Mishap - Sakshi

ప్రముఖ ఇంటర్నెట్‌  సెన్సెషన్‌ యూట్యూబర్‌, హాలీవుడ్‌ నటి లిజా కోశి ఆస్కార్‌ అవార్డు షో కార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలో రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ సడెన్‌గా తడబడి పడిపోయింది. అయితే ఆమె మాత్రం ఆ ఘటనను కవర్‌ చేస్తూ ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. ఆమె అందరిముందు పడిపోవడాన్ని అవమానంగా భావించకుండా చాలా సమయస్ఫూర్తిగా కవర్‌ చేసుకుంది. అక్కడున్న వాళ్లంతా ఆమె పడిపోయిందని సహాయం చేసేందుకు ముందుకొచ్చిన వాళ్లనే షాక్‌కి గురి చేసింది.

వాళ్లు కూడా కాస్త గందరగోళానికి లోనయ్యారనే చెప్పొచ్చు. ఎందుకుంటే? పడిపోయి దాన్నే స్టైయిలిష్‌గా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నట్లు పెట్టడంతో..వాళ్లు పడిపోలేదా? పొరపడ్డామా? అన్నట్టు సందేహంగా చూడటం వాళ్ల వంతయ్యింది. కోశి ఈ వేడుకల్లో ఎరుపు రంగు ఫుల్‌ లెంగ్త్‌ గౌనుతో తళుక్కుమంది. అనుకోని ప్రమాదం జరిగినా ముఖంపై ప్రశాంతతను చెదరనివ్వకుండా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఎంతైన నటి కథ ఆ మాత్రం కవర్‌ చేయాల్సిందే అంటూ సెటైరికల్‌ కామెంట్లతో పోస్టులు పెట్టారు. 

(చదవండి: ఆ ఆటో డ్రైవర్‌ ఫ్లూయెంట్‌ ఇంగ్లీష్‌కి యూకే టూరిస్ట్‌ ఫిదా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement