ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు! | Sakshi
Sakshi News home page

Thangalaan: ఆస్కార్ బరిలో 'తంగలాన్'.. చిత్ర యూనిట్ భారీ ప్లాన్!

Published Mon, Jul 3 2023 6:51 PM

Pa Ranjith Planned To Thangalaan To Get a Chance Into Oscar Race - Sakshi

కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. వినూత్నమైన కథా నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక మోహనన్ కనిపించనుండగా.. పార్వతి, పశుపతి, డేనియల్‌ కాల్టకిరోన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

(ఇది చదవండి: ఉప్పెన హీరోయిన్‌కు వేధింపులు.. ఏకంగా స్టార్ హీరో! )

అయితే ఈ ఏడాది తమిళంలో తెరకెక్కుతోన్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రమిది. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌లో తంగలాన్‌ చోటు దక్కించుకునేలా  ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు.

అయితే ఆస్కార్ రేసుకు సంబంధించిన ఇంకా ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు ఈ సినిమాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం కోలార్‌ గోల్డ్‌ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వరాలు సమకుర్చారు.

(ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!)

Advertisement
 
Advertisement
 
Advertisement