Oscars Awards 2023: 95th Oscar Awards Event Expenses, Cost Of Event, Red Carpet And Outfits - Sakshi
Sakshi News home page

Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్‌ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్‌ ఏంటంటే..

Published Sun, Mar 12 2023 5:12 PM | Last Updated on Sun, Mar 12 2023 5:47 PM

OScars 2023: 95th Oscar Awards Event Expenses Details - Sakshi

యావత్‌ ప్రపంచ దృష్టంతా ఇప్పుడు ఆస్కార్‌ వేడుకపైనే ఉంది. ఈ రోజు (మార్చి 12) రాత్రి 8 గంటలకు లాస్‌ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్‌ ప్రధానోత్సవం జరగనుంది.  భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభం కానుంది. 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేస్తారు.  ఈ ఏడాది మన దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌) నామినేషన్స్‌ దక్కాయి. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు రావాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. వీటిలో ముఖ్యంగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రియులంతా ఆస్కార్‌ వేడక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

చదవండి: Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్‌ ఇస్తారు!

ఇదిలా ఉంటే.. ఈ సారి ఆస్కార్‌ వేడుకల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈసారి అతిథులకు స్వాగతం పలికేది రెడ్ కార్పెట్ కాదు. షాంపైన్. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్.. కానీ రంగు మాత్రం అది కాదు. ‘షాంపైన్’ కలర్ గా మార్చేశారు. తొలిసారి ఈ రెడ్ కార్పెట్ కలర్ ను మారుస్తున్నారు. 50 000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్ అట. ఇది మొత్తం ఇన్ స్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టింది అని సమాచారం.  

చదవండి: Oscar Awards Facts: ఆస్కార్‌ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే?

ఈసారి ఈ అవార్డుల వేడుక కోసం 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 463 కోట్ల 92 లక్షల 47 వేల 300 రూపాయలు. ఇందులో.. కార్పెట్ వద్ద ఓ నటి వేసుకునే డ్రెస్ ఖరీదే 10 మిలియన్ డాలర్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆస్కార్‌ ఈవెంట్‌లో ఏదైనా యాడ్‌ ఇవ్వాలి అనుకుంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్స్‌ డాలర్స్‌ చెల్లించాల్సి ఉంటుందట. మొత్తాని ఆస్కార్‌ 

చదవండి: Natu Natu Song: ఆస్కార్ బరి.. ఆ పాటతోనే గట్టి పోటీ మరీ..!

ఆస్కార్‌ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement