Actress Michelle Yeoh Married Jean Todt After 19 Years Engagement - Sakshi
Sakshi News home page

Michelle Yeoh: ఆస్కార్ నటి సుధీర్ఘ ప్రేమ.. ఇన్నేళ్లకు పెళ్లి

Published Fri, Jul 28 2023 9:26 PM | Last Updated on Fri, Jul 28 2023 9:28 PM

Actress Michelle Yeoh Married Jean Todt After 19 Years Engagement - Sakshi

Actress Michelle Yeoh Marriage: ప్రస్తుతం ప్రేమకి అర్థం మార్చేశారు. నచ్చినంత కాలం కలిసి తిరగడం, అంతా అయిపోయాక పనికిమాలిన కారణం చెప్పి విడిపోవడం ఇప్పటి యువతలో చాలామందికి కామన్ అయిపోయింది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న ఈగోకు పోయి గొడవ పడుతున్నారు. కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఓ నటి ఏకంగా ఎంగేజ్‪‌మెంట్ జరిగిన 19 ఏళ్లకు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఆలోవర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: అరుదైన వ్యాధి బారిన ప్రముఖ నటి.. అలాంటి పరిస్థితిలో!)

ప్రముఖ నటి మిచెల్లా యో చాలా గుర్తింపు తెచ్చుకుంది. 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' అనే సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఈ ఏడాది ఆస్కార్ కూడా గెలుచుకుంది. 60 ఏళ్ల ఈ బ్యూటీ.. అతికొద‍్ది మంది సన్నిహితుల సమక్షంలో తన లాంగ్ టైమ్ పార్ట్‌నర్, ఫెర్రారీ మాజీ సీఈఓ జేన్ టాడ్‌ని గురువారం పెళ్లి చేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా దీనికి వేదికైంది. అయితే ఇది ఆషామాషీ పెళ్లి అయితే కాదు. దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. 

2004 జూలై 26న మిచెల్లాకు జేన్ ప్రపోజ్ చేశాడు. ఆమె దీనికి అంగీకారం తెలిపింది. అది జరిగి 6992 రోజులకు అంటే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెళ‍్లి చేసుకున్నారు. ఇన్నేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నప్పటికీ ఎందుకో పెళ్లి ఆలోచన రాలేదు. ఫైనల్‌గా ఇప్పుడు సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి విషయాన్ని ఫార్ములా వన్ డ్రైవర్ ఫెలిఫ్ మస్సా బయటపెట్టాడు. తన ఇన్ స్టాలో ఈ జంటతో దిగిన ఫొటోలని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. వీళ్ల ప్రేమ-రిలేషన్-పెళ్లి గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement